నవతెలంగాణ-భిక్కనూర్
వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయాలని బిఆర్ఎస్ నాయకులు తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ హాన్మంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వేలిముద్రలు పనిచేయని వృద్ధులకు పంచాయతీ కార్యదర్శి వేలిముద్ర ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే వారని ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో నడవలేని వారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోస్ట్ ఆఫీస్ కు రాలేని వారికి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ కోడూరి సాయ గౌడ్, రాజలింగం, లింగం, స్వామి,బ్రహ్మచారి, శీను, రవి, ధనరాజ్, రమేష్, సిద్ధరాములు, ఎల్లం, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయాలని వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES