నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 1 జనవరి 2025 వ రోజున తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు గా రూపాంతరం చెందడంతో బ్యాంకు ఐఎఫ్సి కోడ్ మారడం వలన రుణమాఫీ డబ్బులు రాలేదని రుణమాఫీ డబ్బులు ఇప్పించాలని కోరుతూ.. ఏం ఆశలత బ్యాంక్ అధికారులతో కలిసి వలిగొండలోని ఆయన నివాసంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఆశలత మాట్లాడుతూ.. 1 జనవరి 2025న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గా రూపాంతరం చెంది బ్యాంక్ యొక్క ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ మారినందున, యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు పొందిన రుణాలు 28.42కోట్ల రూపాయలు మాఫీ జరగలేదని, అ మాఫీకి సంబందించిన వివరాలు ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెల్లి సమస్య పరిశ్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి రఘునందన్ రావుతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిశ్కరించి రైతులకు మేలు చేయాలని కోరినట్లు తెలిపారు.
రుణమాఫీ డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యేకు వినతి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES