నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలో వేరుకుపోయిన పాత సర్పంచుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ కు మాజీ సర్పంచుల బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల నాయకుడు లక్షెట్టి సాయిలు, దేవిదాస్ మాట్లాడుతూ.. 2019 – 24 నిర్వహించిన గ్రామపంచాయతీ పనులను సంబంధించిన పాత బకాయిలు సుమారుగా రూ.2 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. ఇవి ఎస్ ఎఫ్ సి, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రావాల్సి ఉందని మాజీ సర్పంచులు అన్నారు. ఇటీవలే రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించామని సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం నుండి పాత బకాయిల బిల్లులు రాగానే మాజీ సర్పంచ్ ల బకాయిలు చెల్లిస్తామని అన్నారని తెలిపారు. కలెక్టర్ కి ఇచ్చిన కాపీని జతపరుస్తూ జుక్కల్ ఎంపీడీవోకు తమ సమస్యలు అర్థం చేసుకొని నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వానికి మా యొక్క వినతి పత్రాలను పంపించాలని కోరారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎంపీడీవోకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



