Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశాల పెండింగ్ జీతాలను చెల్లించాలని వినతి 

ఆశాల పెండింగ్ జీతాలను చెల్లించాలని వినతి 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను చెల్లించాలని ఆశా వర్కర్లు మంగళవారం మండల వైద్యాధికారి మంజు భార్గవికి వినతి పత్రం అందజేశారు. తమకు వేతనాలు రాక ఆర్థికంగా కుటుంబ పోషణ, నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని తమ ఇబ్బందులను గుర్తించి పెండింగ్‌లో ఉన్న వేతనాలు మంజూరి చేసి తమను ఆదుకోవాలని మండల వైద్యాధికారి మంజు భార్గవినీ కోరుతూ వినతి పత్రం అందజేశారు. పెండింగ్ జీతాలు చెల్లించని యెడల ఆగస్టు 25న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ఆశాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వలియ, ఉపాధ్యక్షులు విద్యారాణీ, ఆశాలు రజియా, సన, రజిత, స్వర్ణలత, సరిత రాములమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -