Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాలనీ సమస్య పరిష్కరించాలని వినతి

కాలనీ సమస్య పరిష్కరించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో మల్లు స్వరాజ్యం కాలనీలో మంచినీళ్లు, విద్యుత్ సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులతో కలిసి తాసిల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2008 సంవత్సరంలో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మంత్రి పదవిలో ఉన్న సమయంలో ఇంటిని నిర్మించుకోవడానికి పత్రాలు అందజేయడం జరిగిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో కాలనీవాసుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలన్నారు. గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కాలనీలో నివసిస్తున్న వారికి సమస్య లేకుండా పరిష్కరించాలని పంచాయతీ అధికారులకు తెలియజేసిన మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయిందన్నారు. మల్లు స్వరాజ్యం కాలనీలో మంచినీరు, విద్యుత్, ప్రజలు జీవించటానికి అన్ని సౌకర్యాలు కల్పించి జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నర్సింలు, కాలనీవాసులు నరసవ్వ, బాలమణి, లక్ష్మి, ఎల్లవ్వ, సావిత్రి, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad