Monday, October 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గా నగర్ కాలనీలో భూములు కాపాడాలని వినతి

దుర్గా నగర్ కాలనీలో భూములు కాపాడాలని వినతి

- Advertisement -

భూముల కొలతలు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి 
నవతెలంగాణ – గాంధారి 

గాంధారి మండల కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీ లో గల కాలనీకి సంబంధించిన భూములను కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తూ కాలనీవాసులు పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. తక్షణమే స్పందించిన పంచాయతీ కార్యదర్శి కాలనీవాసులను వెంటబెట్టుకుని వెళ్లి కబ్జాకు గురైనకాలనీ భూములనుసర్వే(కొలతలు) నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. దుర్గా నగర్ కాలనీ చెందిన కాలనీ  భూములలో వివాస్పదమైన భూములలో ఇంటి నిర్మాణానికి పరిమిషన్ ఇవ్వవద్దని. ఆ భూములు కాలనీ ప్రజల ఉమ్మడి ఆస్తి అని కాలనీ వాసులు తెలిపారు. కాలనీ వాసులకు  తెలియకుండా వివాదాస్పదమైన భూములను ఎవరు కొనవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -