- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
గ్రామంలో నీ ఎస్సీ కాలనీ లో తరచూ విద్యుత్ సరఫరలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామ బిఆర్ఎస్ నాయకులు పోలే అశోక్ విద్యుత్ ఏ ఈ లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు. ఓవర్ లోడ్ తో తరచూ కరెంట్ ట్రిప్ అవుతుందని సమస్య పరిష్కారానికి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామ సమీపంలో కరెంట్ వైర్లపై ఉన్న చెట్లను తొలగించాలని వినతిలో పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని దేవాలయానికి 5 స్తంభాలు మంజూరు చేసి కరెంట్ కనెక్షన్ అందించాలని కోరారు.
- Advertisement -



