Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వడాయిగూడెం స్టేజి వద్ద బస్సులు ఆపాలని వినతి..

వడాయిగూడెం స్టేజి వద్ద బస్సులు ఆపాలని వినతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామ స్టేజి వద్ద బస్సులు ఆపాలని కోరుతూ సోమవారం యాదగిరిగుట్ట డిపో మేనేజర్కు బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు, గ్రామ ప్రజలకు బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు సమయానికి స్కూల్లోకి వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్సు ఆపే విధంగా నోటీస్ బోర్డ్ లో పెడతామని, బస్సు అపని డ్రైవర్ ను విధుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

  గతంలో బస్సును ఆపని డ్రైవర్లను పక్కన పెట్టామని గుర్తు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు చుక్కల శంకర్ యాదవ్, పబ్బలా రమేష్, మాజీ వార్డ్ సభ్యులు బబ్బురి సాగర్, మాజీ వార్డ్ సభ్యులు బబ్బూరి శంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శెట్టి సుమన్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శెట్టి శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసాల రాజు,  ముద్దసాని ఉపేందర్, గ్రామ పెద్దలు శెట్టి అశోక్,  ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గోట్టెటి యాదగిరి యాదవ్ పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad