Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోళ్ల షెడ్డు ఏర్పాటు నిలిపివేయాలని వినతి 

కోళ్ల షెడ్డు ఏర్పాటు నిలిపివేయాలని వినతి 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
కోళ్ల షెడ్డు ఏర్పాటు పనులను నిలిపివేయాలని కోరుతూ మండలంలోని దామెర భీమనపల్లి గ్రామస్తులు శుక్రవారం ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవీందర్ సర్వే నెంబర్ 581 భూమిలో గ్రామానికి 300 మీటర్ల దూరంలో కోళ్ల షెడ్డును ఏర్పాటు చేస్తున్నాడని, అతను గతంలో ఏర్పాటు చేసిన షెడ్డు వల్లనే షెడ్డు సమీప గ్రామస్తులు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. దానికి తోడు మరో షెడ్యూను నిర్మించడానికి ఏర్పాట్లను చేస్తున్నాడని కూడా తెలిసిందన్నారు. తద్వారా షెడ్డు సమీప గ్రామ ప్రజలు దుర్వాసన, వ్యర్ధాలతో రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నదని వెంటనే షెడ్డు నిర్మాణ పనులను ఆపాలని సమస్యను వినతి పత్రంలో పొందుపరిచి ఎంపీడీవో కార్యాలయంలోని సూపరిండెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చిని సైదులు,పంతంగి మహేష్,పగిళ్ల సైదులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -