Thursday, October 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పింఛన్ పెంచాలని తహశీల్దార్ కు వినతి

పింఛన్ పెంచాలని తహశీల్దార్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన పించన్ డబ్బుల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ  మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి కి వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్‌, ఆద్వర్యంలో గురువారం నాయకులు వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ దారుల విషయంలో స్పందించకపోవడం శోచనీయం అన్నారు.

ఇప్పటికైనా స్పందించి  ఇచ్చినా హామీలను అమలు చేయాలని లేని పక్షంలో హైదరాబాద్ మహానగరంలో జరగబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక శంకర్ మాదిగ, ఎంఎస్పి అసెంబ్లీ ఇంచార్జ్ కొనిమల రాజు, వికలాంగుల మండల అధ్యక్షులు బొల్లెడ రమేష్ రెడ్డి, దశరథ్, దాసరి శేఖర్, విజయలక్ష్మి సాయి, గంగమని, మాగ్బుల్,  విజయలక్ష్మి, పోశెట్టి, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -