కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్‌కు వెళ్తున్న ముఖ్యమంత్రికి మిడ్జిల్ ప్రజలు స్వాగతం
నవతెలంగాణ-మిడ్జిల్
దసరా పండుగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామైన కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చి దసరా వేడుకల్లో పాల్గొని, కొడంగల్‌కు బయలుదేరిన సీఎంకు మిడ్జిల్ ప్రజలు స్వాగతం పలికారు. కాగా, మిడ్జిల్ నుంచి జడ్పీటీసీగా గెలుపొంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండలానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. మండల కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల, అన్ని గ్రామాలకు, తండాలకు, బీటీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, వెంకటయ్య, విజయ్ కుమార్, ప్రెస్‌క్లబ్ గౌరవాధ్యక్షులు బాల్‌రెడ్డి, మల్లికార్జున్, టైగర్ జంగయ్య, పెరుమళ్ళ జంగయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు.
మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎంకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES