- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు, భూములు సేకరించాలని భూ నిర్వాసితులు తాండ్ర స్వరూప-మల్లేష్ సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిత్యం ఓసిపి దుమ్ము,దూళితో ఇబ్బందులకు గురివుతున్న నేపథ్యంలో తాడిచెర్ల గ్రామంలో డేంజర్ జోన్లో నివసిస్తున్న నిర్వాసితుల ఇండ్లను తీసుకోవాలని కోరడం జరిగింన్నారు. రెవెన్యూ, జెన్కో, ఏఎమ్మార్ కంపెనీ అధికారులతో కలెక్టర్, సబ్ కలెక్టర్ స్పెషల్ సమావేశం నిర్వహిస్తున్నన్నట్లుగా తెలుసుకొని వినపత్రం అందజేసినట్లుగా తెలిపారు.
- Advertisement -



