Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలని కలెక్టర్ కు వినతి..

సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలని కలెక్టర్ కు వినతి..

- Advertisement -

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాల ఇటివల కురిసిన వర్షాలకు పత్తి తడిసిందని, సీసీఐ నిబంధనలను ఎత్తివేసి, వెంటనే పత్తి కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల కోసం తుఫాను కారణంగా  పత్తి రంగు మారిందని, కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 7 కింటాలు మాత్రమే కొనుగోలు చేస్తానని షరతులు  విధించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఎకరానికి 10 నుంచి 12 గంటల పత్తి దిగుబడి వస్తుందని, వెంటనే నిబంధనలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాకు విధించిన  సుంకాలకు తిరిగి 11 శాతం సుంకాన్ని దిగుమతులపై ఎత్తివేయడానికి వెనక్కు తీసుకోవాలని ఏఐకేస్ ద్వారా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పత్తి క్వింటాకు కనీస ధర 7341 ఉండగా, సీసీఐ కొనుగోలు కేంద్రాలు తేమ పేరుతో రంగు పేరుతో తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడు గంటల పరిమితిని ఎత్తివేసి పత్తిని కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కావిడే సురేష్, రైతులు మల్లారెడ్డి, వెంకటయ్య, సత్తమ్మ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -