నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం కేసారం, బాలంపల్లి గ్రామాల నుండి రాయగిరి ఉన్నత పాఠశాలకు వెళ్ళే బడి పిల్లలకు బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కేసారం గ్రామము నుంచి రాయగిరి ఉన్నత పాఠశాలకు వెళ్ళేందుకు గతములో ఆర్టీసీ బస్సులు ఉదయం సాయంత్రం వేళల్లో నడిచేవని, ప్రస్తుతం బస్సులు రావడం లేదని తెలిపారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం విద్యార్థులు అడవిమార్గాన నడిచి వెళ్ళేటకు అవకాశం లేదని, ఆటో చార్జీలు చెల్లించలేక పోతున్నామని వారు కలెక్టర్ కు వివరించారు. పిల్లల రవాణా సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సు ను ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో విద్యార్థుల తల్లిదండ్రులు కాశపాక కవిత, ఎస్ మున్నీ , ఎస్ శారద, పి యామిని, సి హెచ్ లలిత, సి హెచ్ అనిత, యాదయ్య , రవి, నర్సింహ, బాలస్వామి మహేష్, రాజు లు పాల్గొన్నారు.
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కు వినతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



