Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మశాన వాటిక కబ్జాపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి....

స్మశాన వాటిక కబ్జాపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి….

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  :  భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో గల సర్వేనెంబర్ 247 ప్రభుత్వ భూమిలో  స్మశాన వాటిక సుమారు 10 గుంటల విస్తీర్ణంలో ఉండగా కబ్జా చేశారని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాగా అనాజి పురం గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్ రెడ్డి అనే హైకోర్టు అడ్వకేట్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అది ప్రైవేట్ ఆస్తి అని బోర్డు నాటినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.  ప్రభుత్వ భూమి  అయినా స్మశాన వాటికను   కబ్జా చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా సర్వే చేయించి, ప్రభుత్వ భూమికి హద్దులు నాటించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సర్పంచ్ రాయపురం సురేష్ తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -