నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జూలూరు – రుద్రవెల్లి హైలైవర్ బ్రిడ్జి 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని, పాత కాంట్రాక్టర్ టెండర్ రద్దుచేసి కొత్త ఏజెన్సీ ద్వారా నిధులు కేటాయించి పండ్లు ప్రారంభించాలని కోరుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు. భువనగిరి – చిట్యాల రోడ్డు ప్రస్తుతం నేషనల్ హైవే లో ఉన్నదనీ , ఈ రోడ్డును ఆర్&బీ రోడ్డుకు బదిలీ చేయాలని, హెచ్ ఏ ఎం పధకం కింద నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి పనులను వేగవంతం చేయాలని, మూసీ నదిపై ఉన్న బోల్లెపల్లి- సంగెం బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ పిలిచి పనులు త్వరితగతిన ప్రారంబించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ బేటీలో ఆర్&బీ ఈఎన్ సి మోహన్ నాయక్ పాల్గోన్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని మంత్రికి వినతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES