Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి..

30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: జన్నారం మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని, జన్నారం మండలం ద్వారా భారీ వాహనాల రాకపోకలకు అనుమతించి ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించాలని  గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి  దనసరి అనసూయ (సీతక్క)కు  మండల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ  కన్వీనర్ శ్రీరాముల కొండయ్య  కోకన్వీనర్లు కోడూరి చంద్రయ్య,  కడార్ల నర్సయ్య  ఆండ్ర పురుషోత్తం,  దాసరి శ్రీనివాస్,  ఐలవేణి రవి, గుడ్ల రాజన్న  షేక్ రియాసత్ అలీ, వర్తక సంఘం అధ్యక్షులు వజ్జల వామన్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందించారు.  ఈ సదన్బంగా వారు మాట్లాడుతూ..  30 పడకల ఆస్పత్రి ఆవశ్యకతను మంత్రికి వివరించడం జరిగిందన్నారు. అంతేకాకుండా భారీ వాహనాలను గత కొంత కాలం నుంచి నిలిపివేయడం వలన ఈ ప్రాంతంలో వ్యాపారాలన్నీ చాలా దెబ్బతిని, వ్యాపారస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున వీటికి వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే లక్షకు పైగా జనాభా కలిగి నాలుగు మండల కేంద్రాలకి కేంద్రంగా ఉన్నటువంటి జన్నారం పట్టణంలో తక్షణమే కమ్యూనిటీ హాస్పిటల్ 30 పడకలతో ఏర్పాటు చేయాలని మంత్రి కి విన్నవించడం జరిగింది. దీనిపైన స్పందించిన మంత్రి  అటవీశాఖ అధికారులతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో కూడా తగువిధంగా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad