Monday, June 30, 2025
E-PAPER
Homeజిల్లాలుఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అటవీ శాఖ ఆంక్షలు ఎత్తేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అటవీ శాఖ ఆంక్షలు ఎత్తేయాలి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో మల్యాల గోవర్ధన్ ధ్యారంగుల కృష్ణ, రాజారాంలు కలిసి స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్ సమస్యలను వివరించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2005 సంవత్సరంలో పలు దఫాలుగా నాగారం ప్రాంతంలో వేలాది మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను నిర్మించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో వ్యక్తిగత ఇండ్లు మంజూరు చేయలేదు. ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయలేదు. దీంతో పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లను నిర్లక్ష్యం చేయడంతో ఖాళీ స్థలాలుగానే ఉంచుకోవడం జరిగిందని తెలిపారు.

తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని అన్నారు. కానీ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా అటవీశాఖ అధికారులు ఇందిరమ్మ ఇండ్లను అడ్డుకొని నిర్మించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గత 20 ఏళ్లుగా రెవెన్యూ భూమిగా ఉన్నదాన్ని , ప్రస్తుతం ఇది అటవీ భూమి అంటూ సర్కులర్ జారీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.

సర్కులర్ లో బహుజన కాలనీ, దొడ్డికొమురయ్య నగర్, 300 క్వార్టర్స్, అసద్ బాబా నగర్, పెయింటర్ కాలనీ, ధర్మపురి హిల్స్ కాలనీలలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దు అంటూ అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో నిరుపేదలు వేలమంది స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నప్పటికీ ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇందిరమ్మ ఇళ్లకు ప్రజలను దూరం చేయడమే అవుతుందని అన్నారు. అటవీశాఖ అధికారులు బహుజన కాలోని, దొడ్డి కొమరయ్య నగర్, 300 క్వార్టర్స్, అసద్ బాబా నగర్, పెయింటర్ కాలనీ ధర్మపురి హిల్స్ కాలనీ, ప్రజల పై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని, సమస్య పరిష్కారానికి అటవీశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -