Monday, May 19, 2025
Homeఆదిలాబాద్బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు వినతి..

బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు వినతి..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
మండలంలోని బోరిగాం గ్రామంలో తొలగించిన స్థలం లోనే బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ముధోల్ తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ శ్రీకాంత్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ నెల12న బోరిగాంలో గల ప్రభుత్వ భూమిలో  గ్రామంలోని దళితులు, అంబేద్కరిస్టులు  బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి బుద్ధ జయంతి సందర్భంగా పూజలు చేయడంతో గ్రామంలోని కొందరు దళితులపై రాళ్లతో దాడి చేసి గాయపర్చారని వారు పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు తొలగించిఅవమానపరచడంతో మా మనోభావాలను  దెబ్బతీశారని వినతి పత్రం లో తెలిపారు.వెంటనే సంబంధిత అధికారులు స్పందించి దాడి చేసి గాయ పరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వారంరోజులలో   ఎక్కడి నుండైతే బుద్ద విగ్రహాన్ని తొలగించారో అదే స్థలం లో అధికారులు బుద్ధవిగ్రహాన్ని  పున ప్రతిష్టించాలని  డిమాండ్ చేశారు. లేని యెడల 26వ తేదీ నుండి నిరాహార దీక్ష చేపడుతామని వారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో భారతీయ బౌద్ధమ సభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడపాలే ప్రభాకర్ ,బుద్ధ కమిటీ అధ్యక్షులు దేవదాస్ హాజ్ డే,రాజారాం , ప్రకాశ్, రాందాస్ ,సాయన్న,రాందాస్,నారాయణ,గంగాధర్ జాడే, దిగంబర్,రాహుల్,బింబిసర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ బుద్దాస్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ నిర్మల్ జిల్లా, ది బుద్ధిస్ట్  ఆఫ్ ఇండియా, సమత సైనిక్ దళ్, ఎంప్లాయిస్ కమిటీ, అంబేద్కర్ జన సంఘాలు దళిత సంఘాల నాయకులు తదితరులు, పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -