Friday, July 4, 2025
E-PAPER
Homeజిల్లాలుమహదేవునిగుట్ట భూములు కబ్జా నుంచి కాపాడాలని తహసీల్దార్ కు వినతి

మహదేవునిగుట్ట భూములు కబ్జా నుంచి కాపాడాలని తహసీల్దార్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని మాధవ్ పల్లి, జువ్వడి, గుడిమెట్ గ్రామ శివారుల్లో గల మహాదేవుని గుట్ట భూములు కబ్జాకు గురి అవుతున్నాయి. కబ్జాకు గురికాకుండా కాకుండా చూడాలని, కబ్జాకు గురి అయిన భూములన్నింటినీ మహాదేవునీ గుట్టకు చెందేలా చూడాలని మాధవపల్లి గ్రామస్తులు తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా మాధవపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ .. మహదేవుని గుట్ట భూమి ఏ గ్రామానికి చెందింది కాదని, ఆది మహాదేవుని ఆలయనికి సంబంధించిందని తెలిపారుజ ఇది వందలాది సంవత్సరాలుగా గుట్ట అలాగే ఉందన్నారు. ఈ దేవాలయం అందరికీ చెందినదని, భూములను కబ్జా నుంచి కాపాడాలని ఈ సదర్బంగా తహసీల్దార్ కు విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -