Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని తహశీల్దార్ కు వినతి..

రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని తహశీల్దార్ కు వినతి..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామానికి బిటి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరుతూ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో తాహాసిల్దార్ కార్తీక్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. 2001 సంవత్సరంలో నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి 2016 సంవత్సరంలో రెన్యువల్ చేశారని , రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి లో పేర్కొన్నారు. 2022 రోడ్డు మరమ్మతు పనులకు ప్రొజీడింగ్ మంజూరు చేసి శంకుస్థాపనలు చేసినా నేటికీ పని పూర్తి కాలేదన్నారు. ఇప్పటికైనా రోడ్డు పని పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి జై పి మాజీ మండల అధ్యక్షులు జూలూరు బాలస్వామి , భూత్ అధ్యక్షులు బలరాం , జంగయ్య, భూతుకూరి పరమేష్ , మండల వైస్ చైర్మన్ రాజు , గ్రామ నాయకులు దశరథం యాదవ్, భోజరాజు బాలస్వామి, కృష్ణ, మండల సీనియర్ నాయకులు జంగయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad