Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ – మద్దూరు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిటిఎఫ్, యుటిఎఫ్, టిపిటిఎఫ్, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మద్దూరు తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిటిఎఫ్, యు టి ఎఫ్, టి పి టి ఎఫ్, సంఘాల మండల బాధ్యులు బాకీచంద్రభాను,రంగు రాజ మల్లు, బొంగు చంద్రారెడ్డిలు మాట్లాడుతూ.. అన్ని క్యాడర్ల బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలని, జిహెచ్ఎం  ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి అని, జీవో నెంబర్ 25 ను సవరించి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా చూడాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ అన్నింటిని విడుదల చేయాలన్నారు. ఏకీకృత సర్వీస్ నిబంధన రూపొందించి డిఇఓ డిప్యూటీ డిఇఓ ఎంఈఓ డైట్ బీఎడ్ కళాశాలల అధ్యాపకుల ఖాళీలను శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు. సిపిఎస్ ను రద్దుచేసి యుపిఎస్ ను పునరుద్ధరించాలన్నారు. జీవో 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే సమస్యల పరిష్కారానికి దశలవారీగా ధర్నాలు ర్యాలీలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశం, నర్సింలు, రఫ్ఫత్, రవి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -