Sunday, February 22, 2026
E-PAPER
Homeబీజినెస్'స్వర్గసీమ'కు 'రెరా' షోకాజ్‌లు

‘స్వర్గసీమ’కు ‘రెరా’ షోకాజ్‌లు

- Advertisement -

పలు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు కూడా…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

స్వర్గసీమ ‘అమేయ’ సహా పలు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. స్వర్గసీమ కన్‌స్ట్రక్షన్‌ వారి అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల సైజు, ప్రాజెక్టు పూర్తిపేరు, లేఅవుట్‌గా రిజిస్టర్‌ చేసి, ప్రకటనలు మాత్రం పూర్తి రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుగా చూపిస్తూ కొనుగోలుదారులను తప్పు దోవ పట్టిస్తున్నారని ‘రెరా’ తెలిపింది. ఈ ఉల్లంఘనలను గమనించి ఆ సంస్థకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దానితోపాటు గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, నవనామి ఎలివేట్‌ ప్రాజెక్టు, వర్టెక్స్‌ విరాట్‌ ప్రాజెక్టు, తిరుమలహిల్స్‌ వంటి పలు రియల్‌ ఎస్టేట్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేశారు. అనేక కంపెనీలు ప్రాపర్టీని ‘రెరా’లో ఒక ఉద్దేశ్యంతో నమోదు చేసి, వ్యాపారాన్ని మరో విధంగా ప్రచారం చేసుకుంటున్నారనీ, అనేక ప్రకటనల్లో ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ నెంబర్లు ఉండట్లేదని గుర్తించినట్టు తెలిపారు. ఇల్లు, ప్లాట్‌, యూనిట్‌ అమ్మకాలపై తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ రిజిస్ట్రేషన్‌ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయవద్దని ‘రెరా’ అధికారులు ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లను హెచ్చరించారు. రెరా చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లు దాటి, 8 కంటే ఎక్కువ యూనిట్లు కలిగి ఉన్న ప్రతి ప్రాజెక్టును ముందుగా తెలంగాణ రెరాలో రిజిస్టర్‌ చేయాలనీ, రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్‌ నంబరును మంజూరు చేసిన తర్వాతే ఆ నంబరు ద్వారా అమ్మకాలపై ప్రకటనలు చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -