- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల : మొంథా తుఫాన్ బీభత్సంతో నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో డిండి వాగు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో లతీపూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దంపతులు వరదలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా స్పందించి తాడుల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రక్షణ చర్యల్లో డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్ లింగం, లస్కర్ నాయక్ బృందం పాల్గొన్నారు. వాగులో చిక్కుకున్న దంపతులకు ఆహారం అందించి, గురువారం మధ్యాహ్నం ఒక్క గంటకు వారిని సురక్షితంగా ఇంటికి చేర్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు చూపిన చాకచక్యం, మానవత్వం పట్ల గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు.
- Advertisement -



