Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకృత్రిమ మేధపై పరిశోధనలు చేయాలి

కృత్రిమ మేధపై పరిశోధనలు చేయాలి

- Advertisement -

– ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి
– స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

డాటాసైన్స్‌, కృత్రిమ మేధపై విద్యార్థులు పరిశోధనలు చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి చెప్పారు. రెండురోజులపాటు జరిగే రీసెర్చ్‌ ఇన్‌ ఇంటెలిజెంట్‌ కంప్యూటింగ్‌ ఇంజినీరింగ్‌ (ఆర్‌ఐసీఈ-2025) శుక్రవారం హైదరాబాద్‌ అబిడ్స్‌లోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ (అటానమస్‌)తోపాటు హనోయో యూరివర్సిటీ ఆఫ్‌ ఇండిస్టీ వియత్నాం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రయోగాత్మకమైన విద్య అవసరమని సూచించారు. కంప్యూటర్‌ రంగం అభివృద్ధి చెందితే అన్ని రంగాలకూ ఎంతో ఉపయోగమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్‌ రంగంలో అనేక రకాలైన ఆవిష్కరణలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్లోబల్‌ సమ్మిట్‌లో విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల సైన్స్‌, టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని వివరించారు. దేశంలో రక్షణ రంగం పటిష్టంగా తయారవుతోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్‌ రంగాల్లో వస్తున్న మార్పులు, ఆవిష్కరణలను విద్యార్థులు గమనించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువుతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. అప్పుడే ప్రపంచంలోని విద్యార్థులతో పోటీ పడగలుగుతారని వివరించారు. హనోరు యూనివర్సిటీ ఆఫ్‌ ఇండిస్టీ వియత్నాం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ గుయేన్‌ థీలి, హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ అతుల్‌ నేగి, ఓయూ ప్రొఫెసర్‌ ఎ కృష్ణయ్యతోపాటు సదస్సు నిర్వాహకులు శివాని యాదవ్‌, కన్వీనర్‌్‌ జి శ్రీలత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ కార్యదర్శి, కరస్పాండెంట్‌ కె కృష్ణారావు, యాజమాన్య సభ్యులు టి రాకేశ్‌రెడ్డి, ఆర్‌ ప్రదీప్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ బిఎల్‌ రాజు, అకడమిక్స్‌ డీన్‌ ఎ వినయబాబు, ప్లానింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ డీన్‌ సత్యప్రసాద్‌ లంక, కన్వీనర్లు జి కార్తీక్‌, పి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -