అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
నవతెలంగాణ – హైదరాబాద్
సాహిత్య సాంస్కృతిక మూలాలను వెలికితీసిన పరిశోధనా గ్రంథం, ఈ ‘కురుమల సాహిత్యం, చరిత్ర సంస్కృతి’ అని అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఛాయ సాహిత్యోత్సవ వేదికలో బర్ల మహేందర్ రాసిన పరిశోధన గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ఆచార్య సూర్యా ధనంజయ మాట్లాడుతూ కురుమల సాంస్కృతిక చరిత్రను, ఒగ్గుకథను, మౌఖిక సాహిత్యాన్ని ఎంతో కష్టపడి వెలికితీసిన పరిశోధన అని, మహేందర్ కృషిని అభినందించారు. ఈ పుస్తకాన్ని నవతెలంగాణ ప్రచురించడం సంతోషకరమన్నారు. ఆచార్య రజని మాట్లాడుతూ ఇది కేవలం కురుమల సాహిత్యమే కాదు, సామాన్య ప్రజల సాహిత్యమని అందరూ చదవాలని కోరారు. నవతెలంగాణ బుకహేౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బుక్ హౌస్ జనరల్ మేనేజర్ వాసు, మహేందర్, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాహిత్య సాంస్కృతిక మూలాలను వెలికితీసిన పరిశోధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



