Friday, November 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ ఓటర్లున్న తండాలో ఎస్టీకి రిజర్వు

బీసీ ఓటర్లున్న తండాలో ఎస్టీకి రిజర్వు

- Advertisement -

శంకరాయపల్లి తండాలో సర్పంచ్‌ ఎన్నికలపై అయోమయం
ఎంపీడీవోకు గిరిజనుల వినతి

నవతెలంగాణ- జడ్చర్ల
శంకరాయపల్లి తండాలో ఓటర్లంతా బీసీలుంటే.. సర్పంచ్‌ పదవిని ఎస్టీకి రిజర్వు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీనిపై గ్రామస్తులు జడ్చర్ల ఎంపీడీవో విజరుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో శంకరాయపల్లి తండాను గ్రామపంచాయతీగా గుర్తించినప్పటికీ, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, నోటీసు ఇవ్వకుండా ఎస్టీ ఓటర్ల జాబితాను జడ్చర్ల మున్సిపాలిటీ 9వ వార్డుకు బదిలీ చేశారు. ప్రస్తుతం శంకరాయపల్లి తండాలో 8 వార్డులు, 65 మంది బీసీ ఓటర్లు ఉన్నప్పటికీ, సర్పంచ్‌ పదవిని ఎస్టీకి రిజర్వు చేశారు. ఇది ఎన్నికల ప్రక్రియను క్లిష్టం చేస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి చెందిన ఓటర్లను తిరిగి శంకరాయపల్లి తండా ఓటర్ల జాబితాలో చేర్చి, స్థానిక గిరిజనులకు పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా గ్రామస్తులు ఎంపీడీవోకు విజ్ఞప్తి చేశారు. గతంలో 65 మంది ఓటర్లతో ఎప్పుడూ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఈ అనిశ్చితిని తొలగిస్తూ, రిజర్వేషన్‌ సమస్యపై వెంటనే చర్యలు చేపట్టాలని గోపాల్‌ నాయక్‌, మరికొందరు తండావాసులు ఎంపీడీవోను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -