- Advertisement -
నవతెలంగాణ – శాయంపేట
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధిలోని 24 గ్రామపంచాయతీలలో మొత్తం వార్డుల సంఖ్య 212. ఇందులో 90 వార్డులు మహిళలకు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగతా 122 వార్డుల కోసం పురుషులు లేదా మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్లను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల వారిగా సోమవారం రిజర్వేషన్లు తెలిసే అవకాశం ఉంది.
- Advertisement -



