ఎంపీపీ, జెడ్పిటిసి స్థానాలు బిసి మహిళలకే
42 శాతం బీసీ రిజర్వేషన్లతో రిజర్వేషన్లలో మార్పులు
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రాదేశిక, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించడంతో శనివారం మండలంలోని ప్రాదేశిక, స్థానిక సంస్థలకు అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేయడంతో పాలకుర్తి ఎంపీపీ తో పాటు జెడ్పిటిసి స్థానాలను బీసీ మహిళలకు రిజర్వు చేశారు. పాలకుర్తి మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎస్టీలకు 3, ఎస్సీలకు 3, బీసీలకు 7, జనరల్ 4 స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ డిఎస్ వెంకన్న ఆధ్వర్యంలో ప్రాదేశిక, స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 17 ఎంపీటీసీ స్థానాల్లో దర్దేపల్లి ఎస్టి జనరల్, చెన్నూరు ఎస్టి మహిళ, మంచుప్పుల ఎస్టీ జనరల్, లక్ష్మీనారాయణ పురం ఎస్సీ మహిళ, బమ్మెర 1 ఎస్సీ జనరల్, వావిలాల ఎస్సీ జనరల్, వల్మిడి బిసి మహిళ, పాలకుర్తి 2 బీసీ మహిళ, ఈరవెన్ను బీసీ జనరల్, ముత్తారం బీసీ జనరల్, తొర్రూరు బీసీ జనరల్, విసునూరు బీసీ మహిళ, గూడూరు బీసీ జనరల్, పాలకుర్తి 1 జనరల్, మల్లంపల్లి జనరల్, బమ్మెర 2 జనరల్ మహిళ, కొండాపురం జనరల్ మహిళ లకు కేటాయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండలంలోని 38 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఎస్టీలకు 11, బీసీలకు 13, ఎస్సీలకు 6, జనరల్ 8 స్థానిక సంస్థల స్థానాలు కేటాయించారు. చీమల బావి తండా ఎస్టీ జనరల్, నార బోయిన గూడెం ఎస్టీ జనరల్, సిరిసన్న గూడెం ఎస్టీ జనరల్, నర్సింగపురం తండా ఎస్టీ మహిళ, బిక్య నాయక్ పెద్ద తండా ఎస్టీ మహిళ, మేకల తండా ఎస్టీ జనరల్, పెద్ద తండా కె ఎస్టీ జనరల్, దుబ్బ తండ (టి) ఎస్ టి మహిళ, దుబ్బ తండా (ఎస్పీ) ఎస్ టి మహిళా, టీఎస్ కే తండా ఎస్టీ మహిళ, కిష్టాపురం తండా ఎస్టీ జనరల్, పాలకుర్తి బీసీ మహిళ, బొమ్మెర బీసీ మహిళ, అయ్యంగారిపల్లి బీసీ మహిళ, మంచుప్పుల బీసీ మహిళ, గూడూరు బీసీ జనరల్, ముత్తారం బీసీ మహిళ, హరిజన కాలనీ (విష్ణుపురం) బీసీ మహిళ, హట్టియా తండా బిసి జనరల్, చెన్నూరు బీసీ జనరల్, మల్లంపల్లి బీసీ జనరల్, శాతాపురం బీసీ జనరల్, కోతులాబాద్ బీసీ జనరల్, గోపాలపురం బీసీ జనరల్, కొండాపురం ఎస్సీ జనరల్, ఈరవెన్ను ఎస్సీ జనరల్, తొర్రూరు ఎస్సీ జనరల్, వావిలాల ఎస్సీ మహిళ, దర్దేపల్లి ఎస్సీ మహిళ, తిరుమలగిరి ఎస్సీ మహిళ, రాఘవపురం జనరల్, విసునూరు జనరల్, లక్ష్మీనారాయణపురం జనరల్, తీగారం జనరల్, వల్మిడి జనరల్ మహిళ, పెద్దతండ (బి) జనరల్, గుడికుంట తండా జనరల్ మహిళ, మైలారం జనరల్ లకు కేటాయించారు.
మైలారం, గుడికుంట తండాల్లో బీసీల సంఖ్య ఒకటి రెండు ఉండటంతో ఎస్టీలకు కేటాయించకుండా జనరల్ కేటగిరీలకు కేటాయించడంతో ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాదేశిక, స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహుల్లో నిరాశే మిగిలింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో రిజర్వేషన్లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మండలంలోని 336 వార్డులకు గాను ఎస్టీలకు 94, ఎస్సీలకు 49, బీసీలకు 105, జనరల్ కేటగిరీకి 88 వార్డులను కేటాయిస్తూ పాలకుర్తిలో గల ఎంపీడీవో కార్యాలయంలో వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.