Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం దుకాణాలలో కల్లుగీత సొసైటీలకు రిజర్వేషన్లు కల్పించాలి..

మద్యం దుకాణాలలో కల్లుగీత సొసైటీలకు రిజర్వేషన్లు కల్పించాలి..

- Advertisement -

కల్లుగీత కార్మిక సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి చేగోని సీతారాములు
నవతెలంగాణ – కట్టంగూర్
రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసే మద్యం షాపులలో కల్లుగీత సొసైటీలకు 25 శాతం రిజర్వేషన్  కల్పించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చేగోని సీతారాములు డిమాండ్ ప్రభుత్వాన్ని చేశారు. శనివారం మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో నిర్వహించిన గీత కార్మిక సంఘం 4వ మండలం మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట  నిర్వహించిన బహిరంగ సభలో  మద్యం దుకాణాలలో కల్లుగీత సొసైటీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు.

ఇటీవల గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెచ్చిన మద్యం పాలసీ వల్ల గీతా కార్మికులకు ప్రయోజనం ఉండదన్నారు. కల్లుగీత సొసైటీలకు, టిఎస్టి గ్రామాలకు ఇచ్చినట్లయితే ఆర్థికంగా గీత కార్మికులకు ఉపయోగం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని, 50 ఏళ్లు నిండిన వృత్తిదారులకు పెన్షన్ అందించాలని, వృత్తిలో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. గీత కార్మికులకు ప్రభుత్వం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను అందించాలని, గ్రామాలలో తాటి, ఈత చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం16 మంది తో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.

సమావేశంలో  సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాచకొండ వెంకన్న, కొప్పుల అంజయ్య, నకిరేకల్ మండల అధ్యక్షులు గుడుగూంట్ల బుచ్చిరాములు,కట్టంగూరు మండల కార్యదర్శి దండేంపల్లి శ్రీను, మండల అధ్యక్షులు మాద శ్రీను,జిల్లా ట్రైనర్ కాటమయ్య రక్షణ కమిటీ సభ్యులు పొడిచేటివీరయ్య,మండల సహాయ కార్యదర్శి గుండాల నగేష్,మండల కమిటీ సభ్యులు కొప్పుల రాములు,కారింగు సత్తయ్య, పనస యాదయ్య, గుడుగుంట్ల వెంకన్న, బంధారపు అచ్చలు,గుడుగుంట్ల రామస్వామి, నాగయ్య,సైదులు, రాజు,దండేంపల్లి అంజయ్య, సత్తయ్య, పొలాగోని వెంకన్న, మద రాజయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -