- Advertisement -
-సర్పంచ్ బరిలో తిరుపతి
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని దావన్‌పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు బాణోత్ తిరుపతి ప్రజాసేవను ధ్యేయంగా పెట్టుకుని గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో నిలువనున్నారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఆయన తన ప్రభుత్వ ఉద్యోగం అనస్థీషియా టెక్నీషియన్ పదవికి రాజీనామా చేశారు. గతంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేయాలన్న ఆలోచనతో ఒకసారి ఉద్యోగాన్ని వదిలిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఊరు అంటే తనకు కన్నతల్లి అని, తల్లికి సేవ చేయాలనే తపనతోనే ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీకి ముందుకొచ్చానని తిరుపతి తెలిపారు.
- Advertisement -



