Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅమెరికా బెదిరింపు ఎత్తుగడలను ప్రతిఘటించండి

అమెరికా బెదిరింపు ఎత్తుగడలను ప్రతిఘటించండి

- Advertisement -

సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ
: భారత ఎగుమతు లపై 50శాతం టారిఫ్‌ను విధిస్తూ అమెరికా తీసుకున్న చర్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఏకపక్షంగా తీసుకున్న ఈ చర్య నియంతృత్వమైనదని, అమెరికా ప్రభుత్వ బెదిరింపు ఎత్తుగడలను ప్రతిబింబిస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చల్లో అమెరికా చేసిన డిమాండ్లన్నింటినీ ఆమోదించనందుకు గానూ భారత ఎగుమతులపై 25శాతం టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీనికి తోడు, రష్యా చమురును భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీగా అదనంగా 25శాతం టారిఫ్‌ విధించారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నందుకు భారత్‌ వంటి దేశాలను అణచివేయడానికి అమెరికా, ఇయులు ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క వారు మాత్రం రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నారు.
అమెరికా తీసుకువస్తున్న ఒత్తిడికి లొంగిపోకుండా భారత ప్రభుత్వం ధృఢంగా నిలబడి, ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. ఈ టారిఫ్‌ల పెంపుతో తీవ్రంగా ప్రభావితమవుతున్న భారత ఎగుమతిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో కోరింది.
అమెరికా బెదిరింపులకు వ్యతిరేకంగా, మన దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడానికి తక్షణమే నిరసనలు చేపట్టాల్సిందిగా అన్ని శాఖలకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img