Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైద్య ఆరోగ్యశాఖలో సమస్యలు పరిష్కరించండి

వైద్య ఆరోగ్యశాఖలో సమస్యలు పరిష్కరించండి

- Advertisement -

మంత్రికి టీయూఎం అండ్‌ హెచ్‌ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైద్యరంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌ పారామెడికల్‌ పోస్టులు, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అపాయింట్మెంట్‌ ఆర్డర్స్‌, ఫార్మాసిస్టు, ఏఎన్‌ఎంల ప్రొవిషనల్‌ మెరిట్‌ లిస్టు వేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలసి వినతి పత్రాన్ని సమర్పించింది.

కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాలు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు డిజి. నరసింహారావు, ఎం. శ్రీనివాసులు మంత్రితో మాట్లాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైద్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పర్మినెంట్‌ పారామెడికల్‌ పోస్టులు, సర్సింగ్‌ ఆఫీసర్స్‌ అపాయింట్మెంట్‌ ఆర్డర్స్‌ ఫార్మాసిస్టులు ఏఎన్‌ఎం ప్రొఫెషనల్‌ మెరిట్‌ లిస్ట్‌ వేతనాలను ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -