ఎంపీడీవోకు వినతిపత్రం అందించిన జిపి సెక్రటరీలు..
నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని 30 గ్రామ పచాయతీలలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు వెంటనే ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ తొ కూడిన వినతి పత్రాన్ని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ కు సోమవారం అందించారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ ..గ్రామ పంచయతీకి సంబంధించిన ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ ట్రెజరీ యందు పెండింగ్‌లో ఉన్న చెక్కులను వెంటనే క్లియర్ చేయాలని, గ్రామపంచాయతీలో నిధులు విడుదల చేయాలని, పెండింగ్ చెక్కులు క్లియరెన్స్ కాకపోవడం వలన గ్రామపంచాయతీలో మాకు క్రెడిట్ ద్వారా సామాగ్రి, ట్రాక్టర్ నడిపేందుకు డీజిల్ ఇవ్వడం లేదని తెలిపారు. గ్రామపంచాయతీ రోజువారి నిర్వహణ కొరకు మా సొంత డబ్బులు అప్పు వడ్డీతో తెచ్చి ఖర్చు పెట్టే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 11. 6 . 2025 నుండి గ్రామపంచాయతీలో ఆర్థిక లావాదేవీలు చేయలేమని తెలిపారు. గ్రామపంచాయతీలలో నెలకొంటున్న సాధారణ సమస్యలు వీధి దీపాలు తాగునీటి సమస్య వంటివి తీర్చలేక పోతున్నామని వివరించారు. నిజామాబాద్ , కరీంనగర్ జిల్లాలలో పంచాయతీ కార్యదర్శుల మీద చార్జ్ మెమోలు ఇచ్చిన వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఓపిఎస్ గా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు జేపిఎస్ గా ప్రమోట్ చేయాలని తెలిపారు. ఓపిఎస్ వ్యవస్థను రద్దు చేయాలని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విధి నిర్వహణ కాలాన్ని సర్వీస్ గా పరిగణించి ప్రొటెక్షన్ డిక్లేర్ చేయాలని అన్నారు. గ్రామపంచాయతీ సాధారణ నిధులను ట్రెజరీ నుంచి తొలగించాలని, మున్సిపాలిటీ తరహాలో ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులను గ్రామపంచాయతీకి సమకూర్చాలని అన్నారు. వారంలో మూడు పర్యాయాలు సమీక్షలు సమావేశాలు అని మండల కేంద్ర కార్యాలయానికి రావడం జరుగుతుంది. వాటికి ట్రావెలింగ్ అలివేషన్స్ ఇవ్వాలని, ఉపాధి హామీ కార్యనిర్వాహన కొరకు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు ఉన్నారని అన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులను ఉపాధి హామీ సామాజిక తనిఖీ నుండి పంచాయతీ కార్యదర్శులను తొలగించాలని డిమాండ్ తౌ కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో శ్రీనివాస్‌కు అందించారు. ఈ వినతి పత్రం అందించే కార్యక్రమంలో మండలంలోని 30 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
జీపీ కార్యదర్శుల పెండింగ్ సమస్యలు తీర్చండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES