సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీజీటీఏ ప్రతినిధుల బృందం
టీజీటీఏ డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. గురువారం హైదరాబాద్‌లో రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి నేతృత్వంలో రేవంత్‌రెడ్డిని టీజీటీఏ ప్రతినిధుల బృందం కలిసింది. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు కృషి చేస్తారని తెలిపింది. ఈ కార్యక్రమంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాములు, మహిళా అధ్యక్షురాలు ఎం రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్‌పాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్, సిహెచ్ శ్రీనివాస్, కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



