తమిళనాడు సీఎం స్టాలిన్‌కు సీపీఐ(ఎం) బృందం వినతి
చెన్నై: అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సీపీఐ(ఎం) బృందం వినతిపత్రాన్ని అందజేసింది. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు కె. బాలకృష్ణన్, సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. కనగరాజ్, డి. రవీంద్రన్ లతో కూడిన ప్రతినిధి బృందం సీఎంను కలిసి మెమోరాండం సమర్పించింది. ఇందులో అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల జీతాల డిమాండ్లు, రోడ్డు కార్మికుల డిమాండ్లు, తమిళనాడు విద్యుత్ శాఖలో గ్యాంగ్‌మెన్‌లకు పదోన్నతి, తదితర సమస్యలు పరిష్కరించాలని ఉన్నాయి. అదే విధంగా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులతో చర్చలు జరపాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు.
అపరిష్కృత సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -



