Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఓటర్ జాబితా అభ్యంతరాలను గడువులోపు పరిష్కరించండి

ఓటర్ జాబితా అభ్యంతరాలను గడువులోపు పరిష్కరించండి

- Advertisement -

జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కుముదిని
నవతెలంగాణ – వనపర్తి 

మున్సిపాలిటీ ఓటర్ జాబితాల పై వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ఎన్నికల నిర్వహణకు  అవసరమైన కార్యాచరణ పూర్తి చేసి సన్నద్దం కావాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ పూర్తి చేసి సన్నద్దం కావాలని అన్నారు.

ఈనెల 12 వ తేదీ నాడు వార్డుల వారిగా ఫోటోతో కూడిన ఎలక్ట్రోరల్ జాబితా ప్రచురించడంతోపాటు, 13వ తేదీన డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించి, పోలింగ్ కేంద్రాల వారిగా ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు. పురపాలక ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని అన్నారు.

వీసీలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 12 వ తేదీ నాడు వార్డుల వారిగా ఫోటోతో కూడిన ఎలక్ట్రోరల్ జాబితా ప్రచురించడంతోపాటు, 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించి, పోలింగ్ కేంద్రాల వారిగా ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా, పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్ లను గుర్తించాలని, కౌంటింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధత కావాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -