Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్టాండ్ లో తల్లులకు గౌరవం 

బస్టాండ్ లో తల్లులకు గౌరవం 

- Advertisement -

బాలింతలకు ప్రత్యేక గదుల ఏర్పాటు 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

ప్రయాణ ప్రాంగణాల్లో పసిపిల్లలతో ప్రయాణించే తల్లుల ఇబ్బందులను తీరుస్తూ, ఆర్టీసీ యాజమాన్యం బస్టాండ్లలో ప్రత్యేకంగా ‘పిల్లలకు పాలు ఇచ్చే గదులను ఏర్పాటు చేసింది. గతంలో బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టేందుకు మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం, ఈ వినూత్న సౌకర్యానికి శ్రీకారం చుట్టింది. 

మహాలక్ష్మి పథకంతో మహిళలు బస్సు ప్రయాణానికి మక్కువ చూపుతున్నారు. అందులో బాలింతలు సైతం బస్సు ప్రయాణానికి వెనుకంజ వేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ ఎక్కువై కూర్చోవడానికే ఇబ్బంది పడాల్సి వస్తోంది. బస్సు కోసం వేచి ఉన్న బాలింతలు తమ పిల్లలకు పాలు పట్టించడానికి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలొ రద్దీ ఉన్న బస్టాండ్లలో బాలింతలకు గౌరవమిస్తూ. తల్లి పాలు ఇచ్చు గదులను ఏర్పాటు చేశారు. ఇటీవల నసురుల్లాబాద్ బస్టాండులో ఏర్పాటు చేసిన తల్లి పాలు ఇచ్చు గది. బస్టాండ్లలో ఇలా గదులను ఏర్పాటు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -