– ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి
– పలు చోట్ల మంత్రుల ప్రచారాలు
నవతెలంగాణ – విలేకరులు
రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉందని, మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకటి శ్రీహరి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో బుధవారం మంత్రులు, ఇతర నాయకులు పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 28, 29, 30 వార్డుల్లో పొంగులేటి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు పదేండ్ల ‘రావణాసుర’ పాలనను అంతం చేసి, ప్రజా పరిపాలనను తెచ్చుకున్నారని తెలిపారు. అదే స్ఫూర్తితో మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సమస్యలన్నీ తీరుస్తానని, తాగునీరు, రోడ్లు, డ్రయినేజీ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. మాటలు చెప్పే వారిని కాకుండా, పని చేసే వారిని గుర్తించాలని ప్రజలను కోరారు.
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రం 6వ వార్డులోని బొత్తల తండా, మైనార్టీ కాలనీల్లో అభ్యర్థిని కాలం సునీత రవీందర్ రెడ్డి గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఆరు నెలల్లో తాగునీటి సమస్య, సైడ్ కాలువలు డ్రయినేజీ వ్యవస్థను బాగు చేసి మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మంచి ఉన్నంత కాలమే మర్యాద.. లేదంటే యుద్ధమే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



