Saturday, September 13, 2025
E-PAPER
Homeఖమ్మంపార్ధీనియంతో శ్వాస, చర్మ సంబంధ రుగ్మతలు: ఏడీ డా. హేమంత కుమార్

పార్ధీనియంతో శ్వాస, చర్మ సంబంధ రుగ్మతలు: ఏడీ డా. హేమంత కుమార్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వయ్యారి భామ (పార్ధీనియం ) కలుపు మొక్క తో శ్వాస, చర్మ రుగ్మతలు సోకే అవకాశం ఉందని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ అన్నారు. వయ్యారి భామ అవగాహన వారోత్సవాలు  (ఆగస్ట్ 19 – 22 ) భాగంగా స్థానిక వ్యవసాయ కళాశాల “రావెప్  (గ్రామీణ వ్యవసాయ పని పూర్వక అనుభవ కార్యక్రమం)” గ్రామాల్లో, కళాశాలలో విద్యార్థులకు శనివారం వయ్యారి భామ(పార్ధీనియం) కలుపు మొక్క పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కళాశాల డాక్టర్ హేమంత కుమార్,డాక్టర్ పి.రవికుమార్ లు పార్ధీనియం వలన వచ్చే అనారోగ్య సమస్యల అనగా శ్వాస కోస, చర్మ సంబంధిత సమస్యలను గురించి,వాతావరణ కాలుష్యం,మృత్తికా   కాలుష్యం వలన వచ్చే నష్టాలను విద్యార్థులకు వివరించారు. 

వయ్యారి భామ రహిత గ్రామాలుగా మార్చడంలో రైతులకి అవగాహన కార్యక్రమాలు కల్పించాలని వాటి వల్ల వచ్చే  నష్టాలను వివరించాలని సూచించారు. వ్యవసాయ కళాశాలలో డి. స్రవంతి,డాక్టర్ ఝాన్సీ రాణి లు వయ్యారి భామ నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించారు. పార్ధీనియం కలుపు  నిర్మూలన వ్యవసాయ కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతుందని అని అసోసియేట్ డీన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇతర అధ్యాపకులు డాక్టర్ ఐవి. శ్రీనివాస రెడ్డి, డాక్టర్ రామ్ ప్రసాద్,డాక్టర్ జంబమ్మ, డాక్టర్ నీలిమ, డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రవణ్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -