లేకుంటే రక్తపాతం తప్పదు : ఇజ్రాయిల్, హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : గాజా శాంతి ప్రణాళికపై వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయిల్, హమాస్‌లకు సూచించారు. లేనిపక్షంలో భారీగా రక్తపాతం తప్పదని హెచ్చరించారు. కాల్పుల విరమణపై ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఈజిప్ట్ రాజధాని కైరోలో సోమవారం చర్చలు ప్రారంభమైన వేళ ట్రంప్ నుంచి ఈ హెచ్చరిక వెలువడింది. ‘మొదటి దశ ఈ వారంలో పూర్తవుతుందని నాకు చెప్పారు. ఈ విషయంలో వేగంగా స్పందించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. శతాబ్దాల తరబడి కొనసాగుతున్న ఘర్షణను పర్యవేక్షిస్తూనే ఉంటాను. కాలం చాలా ముఖ్యమైనది. వేగంగా స్పందించకపోతే పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుంది. అలా జరగాలని ఎవరూ కోరుకోవడం లేదు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో పోస్ట్ పెట్టారు. ‘గాజా శాంతి ప్రణాళికపై హమాస్, ప్రపంచ దేశాలతో గత వారాంతంలో సానుకూల చర్చలు జరిగాయి. బందీల విడుదల, గాజాలో యుదా నికి ముగింపే కీలకం. వీటి కంటే మధ్యప్రాచ్యంలో దీర్ఘకాల శాంతి నెలకొనడం చాలా ముఖ్యం. చర్చలు వేగంగా జరుగుతున్నాయి. సాంకేతిక బృందాలు కూడా సమావేశమయ్యాయి’ అని ట్రంప్ వివరించారు.
శాంతి ప్రణాళికపై వేగంగా స్పందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES