కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి దాసు సురేశ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో కుల వివక్ష కారణంగా మృతి చెందిన పసికందు ఘటనపై స్పందించాలని బీసీ రాజ్యాధికార సమితీ వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ రాశారు. కుమ్మెర గ్రామంలో జరుగుతున్న జాతరలో ధోబి కులానికి చెందిన రెండు నెలల పసిపాపను రెడ్డి సామాజిక వర్గాల దాడిలో ప్రాణాలు కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం చర్ల గుడిపాడు గ్రామంలో ఫిబ్రవరి 9న ఒకే కుటుంబానికి చెందిన భువనగిరి శ్రీనివాస్‌రావు, కాకుమాను భావనారుషి అనే చేనేత వర్గపు సోదరులను సైతం అధికారంలో ఉన్న అగ్రకులం వారు హతమార్చి నాగార్జున సాగర్ కుడి కాలువలో పడేయడం జరిగిందన్నారు.
తెలంగాణలోని నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తరచుగా విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీలు పేద, అట్టడుగు వర్గాల ప్రజలను తీవ్రంగా హింసిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మానవుల జీవించే హక్కు ఆర్టికల్ 21ను హరిస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రాబోయే మార్చి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి బీసీల రక్షణ చట్టాన్ని తేవాలని కోరారు.
నాగర్‌కర్నూల్ కుమ్మెర ఘటనపై స్పందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



