Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్పందించారు.. సరిచేశారు

స్పందించారు.. సరిచేశారు

- Advertisement -

నవతెలంగాణ -కోహెడ
వర్షాకాలం వచ్చిందంటే విద్యుత్‌ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సోమవారం మండలంలోని నాగసముద్రాల చెరువులో ఉన్న విద్యుత్‌ పోల్‌కు ఉన్న విద్యుత్‌ వైర్‌ తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బత్తులవానిపల్లి గ్రామానికి వెళ్ళవలసిని 11 కె.వి విద్యుత్‌ వైర్‌ రాత్రి సమయంలో తెగిపోవడంతో బత్తులవానిపల్లి గ్రామస్థులు లైన్‌మెన్‌ హైమొద్దీన్‌కు చరవాణిలో సమాచారం అందించారు. దీంతో లైన్‌మెన్‌ అసిస్టెంట్‌ లైన్‌మెన్‌లు కలిసి చెరువులోకి దిగి వైర్‌లను సరిచేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ రాజేందర్‌, హరీష్‌, రాజులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -