- Advertisement -
- కుక్కల నివారణ కోసం జిపి అధికారులు చర్యలు
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో కుక్కలతో భయం అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు స్పందన లభించింది. నాలుగు రోజుల క్రితం నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు పంచాయతీ అధికారులు స్పందించారు. కుక్కల నివారణ చర్యలు చేపట్టారు కుక్కలను పట్టుకునే వారిని పిలిపించి కుక్కల ఏరివేత కార్యక్రమం కొనసాగిస్తున్నారు. గ్రామంలో వాడవాడలో కుక్కలను పట్టుకుని తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ తెలిపారు.
- Advertisement -