రాఘపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్
కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని వెల్లడి
నవతెలంగాణ – పాలకుర్తి
మండలంలోని రాకపురం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తహసిల్దార్ నాగేశ్వర చారి శుక్రవారం సందర్శించి పరిశీలించారు. ఈనెల 22న నవ తెలంగాణలో గొర్రెల ఆవాసాలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనే శీర్షికన ప్రచురితమైన కథనాన్ని స్పందించిన తహసిల్దార్ రాగపురం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అక్రమంగా వాడుకునే వ్యక్తుల పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా నాగేశ్వర చారి మాట్లాడుతూ రాగపురం డబుల్ బెడ్ రూమ్ ల వివరాలను కలెక్టర్ కు నివేదికను అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాకేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, గ్రామస్తులు గూడూరు శ్రీనివాస్, సోమ శ్రీకాంత్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES