Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ కథనానికి స్పందన 

నవతెలంగాణ కథనానికి స్పందన 

- Advertisement -

జాతీయ రహదారిపై గుంతల పూడ్చివేత
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 

మండల కేంద్రంలోని గాంధీ నగర్ వద్ద ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన 63వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలను మంగళవారం రోడ్లు భవనాల శాఖ అధికారులు పూడిపించారు. సోమవారం ‘జాతీయ రహదారిపై గుంతల ప్రయాణం’ శీర్షికతో నవతెలంగాణలో ప్రచురితమైన కథనానికి రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించారు. గత కొన్ని నెలలుగా మండల కేంద్ర పరిధిలోని 63వ నంబర్  జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతల్లో ప్రయాణం సాగించలేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను, తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నవ తెలంగాణ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో స్పందించిన రోడ్డు భవనాల శాఖ అధికారులు మండల కేంద్రం పరిధిలో జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలను ప్రస్తుతానికి కంకర సిమెంట్ మిశ్రమంతో నింపి మరమత్తులు చేశారు. వారం పది రోజుల్లో బీటీ వేసి రోడ్డును పూరి పూర్తిస్థాయిలో బాగు చేస్తామని స్పష్టం చేశారు.

ధర్నా, రాస్తారోకోకు గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయం

మండల కేంద్ర పరిధిలో నాగపూర్ క్రాసింగ్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలతో జరుగుతున్న ప్రమాదాలపై నవతెలంగాణలో వచ్చిన కథనానికి స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు స్పందించారు. గుంతలు పడ్డ రోడ్డు విషయమై రోడ్లు భవనాల శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళితే సరైన స్పందన రాకపోవడంతో  విలేజ్ సోషల్ మీడియా గ్రూపులో గ్రామ అభివృద్ధి కమిటీలు సభ్యులు స్పందించి ఓ నిర్ణయానికి వచ్చారు.రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్ని మొరంతో నింపడంతో పాటు అక్కడే ధర్నా, రాస్తారోకో చేయాలని నిర్ణయించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా గ్రూపులో వెల్లడించారు.ఈ నిర్ణయానికి యువత నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. మంగళవారం ఉదయం స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు పలువురు యువకులు ఏకమై నాగపూర్ క్రాసింగ్ వద్ద ధర్నా, రాస్తారోకో చేయడానికి ప్రయత్నం చేశారు. స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారాన్ని తెలుసుకున్న రోడ్డు భవనాల శాఖ అధికారులు  స్పందించి అదే సమయానికి నాగపూర్ క్రాసింగ్ వద్దకు చేరుకున్నారు.

గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో మాట్లాడి నిర్వహించ తలపెట్టిన ధర్నా, రాస్తారోకోను విరమింప చేశారు. ప్రస్తుతానికి రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్ని సిమెంట్ కంకరతో నింపి, వారం పది రోజుల్లో బీటీ వేస్తామని తెలియజేశారు. రోడ్డుపైకి వస్తున్నాను నీటి విషయమై పరిశీలన చేశారు. రోడ్డు పక్కనే ఉన్న పెద్దగుట్ట నుండి రోడ్డుపైకి వర్షపు నీరు రావడం వల్ల తరచు రోడ్డుపై గుంతలు పడుతున్నట్లు గుర్తించారు. గుట్ట నుండి వస్తున్న వర్షాపు నీరు ద్వారా రోడ్డు పాడవుతున్నందున రోడ్డు పక్కన వర్షపు నీరు పోయే విధంగా కందకాలు తీయాలని అధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య,  గ్రామ కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి, ఉట్నూర్ రాజశేఖర్, బుచ్చి మల్లయ్య, ధాత్రిక రాజ్ కుమార్, చింత ప్రవీణ్, పాలెపు రాజేష్, చిన్న గంగారం, డిష్ నరేందర్, డిష్ నర్సయ్య, ఉట్నూరు ధోని, ఉట్నూరు సతీష్, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -