- Advertisement -
గేట్ వాల్ ఛాంబర్ గుంతను పూడ్చిన గ్రామపంచాయతీ సిబ్బంది
నవతెలంగాణ – రాయికల్
ఈ నెల 5వ తేదీన “ప్రమాదకరంగా మిషన్ భగీరథ గేట్ వాల్ ఛాంబర్” శీర్షికతో నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామపంచాయతీ సిబ్బంది గేట్ వాల్ ఛాంబర్ వద్ద ఉన్న ప్రమాదకర గుంతలో పైపు ఏర్పాటు చేసి,గుంతను పూర్తిగా పూడ్చివేశారు. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఊరట చెందారు. ప్రజా సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నందుకు గ్రామస్తులు నవతెలంగాణ దినపత్రికకు, గ్రామపంచాయతీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



