Tuesday, February 10, 2026
E-PAPER
Homeకరీంనగర్నవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ కథనానికి స్పందన

- Advertisement -

ఫీల్డ్ అసిస్టెంట్‌కు నోటీసు జారీ..
నవతెలంగాణ – రాయికల్

ఈనెల 8వ తేదీన నవతెలంగాణ దినపత్రికలో ‘పని చోటు కాదు.. గ్రామపంచాయతీ వద్దే బోర్డులు’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. కథనంపై ఎంపీడీవో బింగి చిరంజీవి స్పందిస్తూ రాజానగర్ గ్రామపంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నేమ్ బోర్డులను పని జరిగిన ప్రదేశాల్లో కాకుండా గ్రామపంచాయతీ భవనం వద్ద ఉంచిన వ్యవహారంపై తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నేమ్ బోర్డులు ఏర్పాటు చేసిన అంశంపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్‌కు నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి,బాధ్యత నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిర్లక్ష్యానికి తావులేదని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -