Friday, February 20, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ కథనానికి స్పందన

- Advertisement -

ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ పూర్తి చేసిన విద్యుత్ శాఖ అధికారులు
నవతెలంగాణ – ఉప్పునుంతల 

నవతెలంగాణలో ప్రచురితమైన “ట్రాన్స్ఫార్మర్ అమరికకు ఎదురుచూపులు” కథనంపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామానికి మంజూరైన కొత్త ట్రాన్స్ఫార్మర్‌ను వెంటనే అమర్చి కనెక్షన్ పూర్తి చేసినట్లు ఏఈ కొండల్ తెలిపారు.

ఈ సందర్భంగా విద్యుత్ లైన్మెన్ రమేష్ మాట్లాడుతూ.. స్థల ఏర్పాటులో జాప్యం వల్ల ఆలస్యం జరిగినట్లు చెప్పారు. కొత్త స్థలం కేటాయించకపోవడంతో పాత స్థలంలోనే ట్రాన్స్ఫార్మర్‌ను అమర్చినట్లు వివరించారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ పూర్తయ్యిందని, గ్రామంలో ఇకపై వోల్టేజ్ సమస్య ఉండదని అధికారులు స్పష్టం చేశారు. స్పందించిన అధికారులకు నవతెలంగాణ పత్రికకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -