ట్రాన్స్ ఫార్మర్ బిగించి, భగీరధ పైపు లైన్ కు మరమ్మత్తులు
నవతెలంగాణ – పెద్దవూర
నాయినవాని కుంటలో తాగునీటి కష్టాలు, ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి ఐదు రోజులు, నింపని మిషన్ భగీరధ ట్యాంక్, కనీసం వాడుకునేందుకు కూడా చుక్క నీళ్లు లేవు. దాహాన్ని తీర్చుకునేందుకు బిందెడు నీళ్లు లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. దాహార్తి తీర్చండి సారూ.. అంటూ విన్నపించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని నవతెలంగాణలో గురువారం వచ్చిన కథనానికి మిషన్ భగీరధ ఏఈ నడ్డి గోపాల కృష్ణ, ట్రాన్స్ కో అధికారులు స్పందించారు. శుక్రవారం సాయింత్రానికి, ట్రాన్స్ ఫార్మర్ బాగుచేసి ఫిట్టింగ్ చేస్తామని, అదేవిదంగా మిషన్ భగీరధ పగిలిన పైపు లైన్ ను కూడా సాయంత్రమే బాగుచేసి శనివారం ఉదయం వరకు ట్యాంక్ లోకి నీళ్లు వచ్చే విదంగా చర్యలు తీసుకుంటామని వారు చరవానిలో తెలిపారు. దాంతో నాయినవానికుంట గ్రామం లో తాగునీటి సమస్య కు పరిష్కరం లంభించింది.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



